వినాయక నిమజ్జనంకై నీటికి శుద్ధిపూజ

50చూసినవారు
వినాయక నిమజ్జనంకై నీటికి శుద్ధిపూజ
చిత్తూరు నగరంలోని కట్టమంచిలోని వివేకానంద సాగర్ లో వినాయక నిమజ్జనం కొరకు నీటికి శుద్ధి పూజా కార్యక్రమాన్ని బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు రామభద్ర మాట్లాడుతూ పంచగవ్య, గంగాజలంతో జలశుద్ధి, మహాహారతి నిర్వహించామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పెద్ద విగ్రహాలు కొరకు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారని మూడవరోజు, ఐదవ రోజు నిమజ్జనం జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్