మున్సిపల్ టీచర్స్ సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

65చూసినవారు
మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. లక్ష్మీ నగర్ కాలనీలోని కార్యాలయంలో మున్సిపల్ ఉపాధ్యాయులు, సంఘ నేతలతో శుక్రవారం సమావేశం అయ్యారు. నగరంలోని ఆరు మున్సిపల్ పాఠశాలలకు కంప్యూటర్ ఆపరేటర్లు కావాలని కోరగా రెండు రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే అన్ని పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్