ప్రతివారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం

79చూసినవారు
ప్రతివారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం
డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గురువారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. నగరపాలకతో పాటు, గుడిపాల, చిత్తూరు రూరల్ ప్రాంతాల నుంచి ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఎమ్మెల్యే గురజాల స్వయంగా విని నమోదు చేసుకోవడంతో పాటు సావధానంగా సమాధానాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్