ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మొత్తం 34మంది భక్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి, హెడ్ నర్స్ సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.