కార్వేటినగరంలోని మండలం కొల్లాగుంట సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, పిఎం మోదీ ఫోటోలను కూటమి నాయకులు ఏర్పాటు చేశారు. మండలంలోని అన్ని సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, పీఎం ఫోటోలను ఏర్పాటు చేయాలని గురువారం కోరారు. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలని కోరారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జయచంద్ర, పవన్ కుమార్, తులసి రామన్ పాల్గొన్నారు.