రేపు మాన్యం భూములకు వేలం

54చూసినవారు
రేపు మాన్యం భూములకు వేలం
జీడీ నెల్లూరు మండలంలోని స్థానిక అల్లిఎల్లమ్మ ఆలయ భూములను కౌలుకు ఇచ్చేందుకు బుధవారం గుడి ఆవరణలో వేలం వేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి తిమ్మారెడ్డి మంగళవారం తెలిపారు. సర్వే నంబర్ 216లో 1-06 ఎకరాలు, 303లో 0-72 సెంట్లు కౌలుకు ఇవ్వనున్నామని, 2024 జూన్ 30 నుంచి 2027 జూన్ 29వ తేదీ వరకు కౌలు కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్