జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం బొమ్మయపల్లి సచివాలయంలో మంగళవారం ప్రభుత్వం సబ్సిడీ వేరుశనగ విత్తనాలను రైతులకు అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వేరుశనగ విత్తన కాయల కొనుగోలుకు భారీ సంఖ్యలో రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.