మామిడి రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గంగాధర నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా జీడి నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరులోని మామిడికాయల ఫ్యాక్టరీ వద్ద మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులతో కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతులకు ఇవ్వాలని, అదేవిధంగా టోకెన్ లిస్టును ఫ్యాక్టరీ బయట డిస్ప్లే లో ఉంచాలని రమేష్ కోరారు.