జీడి నెల్లూరు: ఆకట్టుకున్న దుర్యోధన వధ

50చూసినవారు
జీడి నెల్లూరు: ఆకట్టుకున్న దుర్యోధన వధ
జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం, పచ్చికాపలంలో జరుగుతున్న 95వ వార్షిక మహాభారత మహోత్సవంలో భాగంగా ఆదివారం దుర్యోధనవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హాజరై భారతంలోని దుర్యోధనవధ పర్వాన్ని ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాండవ దేవతామూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్