గంగాధరనెల్లూరు మండలంలోని జైన్ ఫాం ఫ్రెష్ కర్మాగారం ఎదుట శనివారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు వెంటనే పర్మిట్లు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా పరిశ్రమ యజమానులు తమకు టోకన్లు ఇవ్వలేదని, అదే విధంగా తోకలను బ్లాక్లో అమ్ముకుంటూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వాపోయారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు.