జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు శుక్రవారం తెలియజేశారు. మండలంలోని యనమలమంద, బొమ్మయ్య పల్లి, మాంబేడు తదితర గ్రామాలలో వరి పంట నెల పై పడింది. పంట చేతికి అందే సమయంలో ఈ విధంగా జరగడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. అధికారులు తమ పంటను పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు.