జీడి నెల్లూరు నియోజకవర్గం, గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మామిడి రైతుల కోసం మంగళవారం టోకెన్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కష్టాలను అర్థం చేసుకొని ఎమ్మెల్యే చొరవతో టోకెన్ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు.