చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని జిల్లా టీడీపీ కార్యదర్శి కృష్ణమ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా శనివారం గంగాధర నెల్లూరులో స్థానిక నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా టన్నుకు రూ. 4, 000 ప్రోత్సాహం ప్రకటించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. వైసీపీ నేతలు మామిడిపై అనవసరపు మాటలు మాట్లాడటం ఆపాలని అన్నారు.