చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద రైతులు శనివారం ధర్నా చేపట్టారు. మామిడి రైతులకు టోకెన్లు ఇవ్వడంలేదని రైతులు రోడ్డెక్కారు. మామిడికాయ టోకెన్లను బ్లాక్‌లో అమ్ముతున్నారని ఆరోపణలు వస్తుండడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతామని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.