కాగితపు సంచులతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని హెచ్ఎం శ్రీవాణి అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నేషనల్ గ్రీన్ కోర్ గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధులు, డివిజన్ కన్వీనర్ రాజేంద్ర ఆధ్వర్యంలో ఎన్ జి సి విద్యార్థులచే" ప్రపంచ కాగితపు దినోత్సవం"ఘనంగా నిర్వహించి ర్యాలీ జరిపారు. అనంతరం కాగితపు సంచుల వాడకం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు వేణుగోపాల్, రహమత్ భాషా, కాటయ్య, చంద్రబాబు, చలపతి , సైదుల్లా తదితరులు పాల్గొన్నారు.