చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తయ్యూరు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఈవో తిమ్మారెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి ఉత్సవాలను అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.