గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం వైద్య అధికారులు మాట్లాడుతూ రాష్ట్రీయ బాల సురక్ష ప్రోగ్రామ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జీడి నెల్లూరు హైస్కూల్లో 186 మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశామాన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.