గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే థామస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని పాలసముద్రం మండలం తిరుమల రాజుపురం, వెదురు కుప్పం మండలంలోని ఈనం కొత్తూరు, కార్వేటి నగరంలోని ఎర్రమ రాజు పల్లి తదితర గ్రామాలలో పర్యటించి గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.