గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలు చలి తీవ్రతకు తట్టుకోలేక చలిమంటలు వేసుకొని సేద తీరుతున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితులలో ప్రజలు ఉండిపోతున్నారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణం పట్ల శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.