చిత్తూరు జిల్లా, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వ్యక్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్వేటి నగర మండలకేంద్రంలోని రుక్మిణి, సత్య భామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు, పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.