ఏపీ మాల వెల్ఫేర్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ పొన్న గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ యువత సబ్సిడీ లోన్ల సంఖ్యను పెంచాలని, ఎగువ ముదికుప్పంలో ఉన్న పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని తదితర విషయాలను వినతి పత్రంలో చేర్చి కలెక్టర్ కు ఇచ్చామన్నారు.