జీడీనెల్లూరు మండలం ఎల్లమరాజుపల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మత్తులు జరుగుతున్న కారణంగా జూన్ 11 నుంచి 14వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ సురేష్ కుమార్, ఏఈ వరదరాజులు బుధవారం తెలిపారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.