చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కార్వేటి నగరం పంచాయతీ పెద్ద హరిజనవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నాయకులు 100 రోజులలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిని తెలియజేశారు. సంక్షోభ సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత టీడీపికే దక్కిందన్నారు.