జీడి నెల్లూరు నియోజకవర్గం, గారు పెట్టి నగరం ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సిడిపిఓ శోభ రాణి తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలలో పనిచేసే సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.