జీడి నెల్లూరు: జర్నలిస్టులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి

67చూసినవారు
జర్నలిస్టులపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలంటూ గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ కూడలి నుంచి పోలీస్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి సీఐ శ్రీనివాసంతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షుడు లోకనాథం మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు , కేసులు పెట్టడం ఎక్కువ అయ్యాయని అన్నారు.

సంబంధిత పోస్ట్