జీడి నెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా టీడీపి ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉదయం 10: 30 కు పాలసముద్రం మండలం, 12 గంటలకు గంగాధర నెల్లూరు మండలం, మధ్యాహ్నం రెండు గంటలకు వెదురు కుప్పం మండలం, మూడు గంటలకు కార్వేటి నగరంలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు.