జీడి నెల్లూరు: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

80చూసినవారు
జీడి నెల్లూరు: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
జీడి నెల్లూరు నియోజక వర్గం, పాలసముద్రం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్