జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని రుక్మిణి, సత్య భామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి బ్రహ్మోత్సవాల నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18న అంకురార్పణ, 19న ధ్వజారోహణం, 23న గరుడ వాహనం, 26న రథోత్సవం, 27న ధ్వజావరోహణం, 28న పుష్పయాగం ఉంటుందన్నారు. ఉదయం పూజలు, రాత్రి వేళల్లో వాహన సేవలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.