జీడి నెల్లూరు మండలం, వేల్కూరులో గంగజాతరను మంగళవారం రాత్రి అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను అమ్మవారికి పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.