జీడి నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో బుధవారం ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ ఆర్ పురం మండలానికి చేరుకున్న ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ థామస్ పలు ప్రారంభోత్సవాలను చేస్తారు. అదేవిధంగా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని నాయకులు తెలిపారు.