జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం, ధర్మ చెరువు గ్రామంలో మంగళవారం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు , కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్థానిక వైసీపీ నాయకులు ఆయనకు మండలంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. అనంతరం నారాయణస్వామి నాయకులకు పలు సూచనలు చేసి మండలంలో పార్టీ అభివృద్ధికి చేయాలని తెలిపారు.