జీడి నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం లో శనివారం సాయంత్రం ఒకసారిగా వాతావరణం మారింది. మండల పరిధిలోని దాసరపల్లె గ్రామ సమీపం లోని కొబ్బరి చెట్లుపై హఠాత్తుగా పిడుగు పడటంతో ఆ శబ్దానికి గ్రామస్తులందరూ భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడ్డ ప్రదేశంలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మారుతున్న వాతావరణం పట్ల
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.