జీడి నెల్లూరు: ఈ ఘటన ఎంతో బాధాకరం: మాజీ డిప్యూటీ సీఎం

78చూసినవారు
కర్ణాటక రాష్ట్రం హోస్కోట వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో బాధాకరమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ 50 లక్షలు, గాయపడిన వారికి తక్షణ సహాయం కింద రూ 10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్