జీడి నెల్లూరు: ఈ ఘటన ఎంతో బాధాకరం: ప్రభుత్వ విప్

80చూసినవారు
జీడి నెల్లూరు: ఈ ఘటన ఎంతో బాధాకరం: ప్రభుత్వ విప్
కర్ణాటకలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన పలువురి మరణంపై ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే వీఎం. థామస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన జీడి నెల్లూరులో మాట్లాడుతూ మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కోరారు.

సంబంధిత పోస్ట్