జీడి నెల్లూరు: మహిళను ఢీకొన్న ద్విచక్ర వాహనం

58చూసినవారు
జీడి నెల్లూరు: మహిళను ఢీకొన్న ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలైన ఘటన జీడి నెల్లూరు నియోజక వర్గం, ఎస్ఆర్ పురంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని చిన్న తయ్యూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ రోడ్డుపై నడిచి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కి, చంద్రమ్మకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్