జీడి నెల్లూరు: యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుంది

73చూసినవారు
జీడి నెల్లూరు: యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుంది
ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందని నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, కృష్ణాపురం జలాశయం వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు యోగా గురువు సుధాకర్ యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్