జీడి నెల్లూరు మండల కేంద్రం ఎస్సీ కాలనీ వద్ద చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు పుత్తూరు వైపు నుంచి చిత్తూరుకు వస్తున్న కారు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం లోని వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.