కేఏ పురం: ఈనెల 15న చేపల చెరువు బహిరంగ వేలం

84చూసినవారు
కేఏ పురం: ఈనెల 15న చేపల చెరువు బహిరంగ వేలం
జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం, కేఏ పురం పంచాయతీలో ఈనెల 15న చేపల చెరువు బహిరంగ వేలం నిర్వహిస్తామని మండల మత్స్య అభివృద్ధి అధికారి రామ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ కేఎం పురం పరిధిలోని రెడ్డి చెరువు, చిన్న కమ్మచెరువుకు శనివారం ఉదయం పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. గుత్తేదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్