కార్వేటినగరం పట్టణంలోని ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో ఆదివారం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు జనసేన జీడీనెల్లూరు ఇన్ఛార్జ్ యుగంధర్ శనివారం తెలిపారు. జీడీ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేలు థామస్, గురజాల జగన్మోహన్, ఆరణి శ్రీనివాసులు హాజరవుతారన్నారు. ఎమ్మెల్యేలకు సన్మానం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.