ఆలయాల్లో ప్రత్యేక పూజలు

64చూసినవారు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కార్వేటినగరం పట్టణంలోని ద్రౌపతి సమేత ధర్మరాజు, బంగారమ్మ, అంకాల పరమేశ్వరి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలు ఆలయాల వద్ద అన్నదానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్