ఎస్ ఆర్ పురం: బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

54చూసినవారు
ఎస్ ఆర్ పురం: బీటీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురం మండలం కనికాపురంలో రూ. 74 లక్షల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును బుధవారం ఎమ్మెల్యే థామస్ ప్రారంభించారు. ముందుగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పొన్న యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్