గంగాధర నెల్లూరు మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ రవి మంగళవారం హెచ్చరించారు. ముక్కలతూరు, వేల్కూరు, కొట్ర కోన, కలిజివేడు రెవెన్యూ గ్రామ పరిధిలోని నీవానదిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్ కు రూ. 50వేలు, జీసీబీకి రూ. 1 లక్ష జరిమానా విధించి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.