చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం ముద్దికుప్పం పంచాయతీలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం 100 రోజులలో చేసిన కార్యక్రమాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.