జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ లో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తామని సంస్థ ప్రధాన అధికారి సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ పాస్ అయి 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జాబ్ మేళాలో పాల్గొనాలనుకునే నిరుద్యోగులు తమ ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని తెలిపారు.