చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలోని పేట ముత్యాలమ్మ గుడిలో దొంగతనం జరిగినట్లు స్థానికులు బుధవారం గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు, భక్తులు వెల్లడించారు. సుత్తి, ఇనుప రాడ్లు ఉపయోగించి తాళాలు పగలగొట్టినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.