కేంద్రంలో బీజేపీ మూడవ సారి అధికారం చేజిక్కించంకుని ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో జనసేన నాయకులు గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. భారీ స్థాయిలో బాణా సంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేనకు అనంకూలంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, హర్ష వర్థన్, గిద్దలూరు మనోజ్ కుమార్, సయ్యద్ నయీమ్, పలువురు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.