తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో యథేచ్ఛగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. మసీదు వీధిలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ భవనాలు నిర్మిస్తున్నారు. గూడూరు మునిసిపల్ కమిషనర్ ఆఫీసుకు కూతవేటు దూరంలో జరుగుతున్న నూతన భవన నిర్మాణం అధికారులు గమనించకపోవడం గమనార్హం.