నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని, ఆయన యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని గూడూరు ఎమ్మెల్యే డా. పాశం సునీల్ కుమార్ అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సోమవారం గూడూరు పట్టణంలోని ఒకటవ వార్డు రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలోని బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.