తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ కు చెందిన ఎన్ బీ కేఆర్ విద్యాసంస్థల బస్సు మంగళవారం అదుపుతప్పి బోల్తా పడింది. ముత్తుకూరు నుంచి చిల్లకూరు మండలం వరగలి మీదుగా విద్యానగర్ కు వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉండగా, ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.