వాకాడు మండల పరిధిలోని తూపిలి పాలెం సముద్ర తీరంలో గురువారం కొంతమంది విద్యార్థులు సముద్ర స్నానం ఆచరించగా వారిలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలోని అలలు ఉదృతకు కొట్టుకుపోయారు. శుక్రవారం పోలీసులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల మృతదేహాల కోసం సముద్రతీరంలో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం సాయంత్రం గల్లంతయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరైన లోకేష్ మృతదేహం అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది.